Teja: కరోనా బారినపడిన టాలీవుడ్ దర్శకుడు తేజ

 Tollywood senior director Teja tested corona positive
  • గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరిపిన తేజ
  • కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు
  • తేజకు తప్ప అందరికీ నెగెటివ్
టాలీవుడ్ చిత్రపరిశ్రమలోనూ కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి కరోనా బారినపడ్డారు. తాజాగా డైరెక్టర్ తేజ కూడా కరోనా బాధితుల్లో ఒకరయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. తేజ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
Teja
Corona Virus
Positive
Director
Tollywood

More Telugu News