నలుగురు చెల్లెళ్లతో హీరో అక్షయ్ కుమార్.. 'ర‌క్షా బంధ‌న్' ఫస్ట్‌ లుక్‌ విడుదల!
Add ap7am to your home Screen

నలుగురు చెల్లెళ్లతో హీరో అక్షయ్ కుమార్.. 'ర‌క్షా బంధ‌న్' ఫస్ట్‌ లుక్‌ విడుదల!

akshay kumar new movie first poster
  • తన చెల్లెళ్లను ఆప్యాయంగా హత్తుకున్న హీరో
  • ఈ సినిమా క‌థ ప్రేక్షకుల హృద‌యాల‌ని తాకుతుందని వ్యాఖ్య
  • ప్రేక్షకులను న‌వ్వించ‌డంతో పాటు ఏడిపిస్తుందన్న అక్షయ్
రాఖీ పండుగ సందర్భంగా బాలీవుడ్ సినిమా 'ర‌క్షా బంధ‌న్' సినిమా ఫ‌స్ట్ లు‌క్‌ను ఆ చిత్ర హీరో అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశాడు. ఈ ఫొటోలో నలుగురు చెల్లెళ్లను ఆప్యాయంగా హత్తుకున్న అక్షయ్ కుమార్ ఆనందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా క‌థ ప్రేక్షకుల హృద‌యాల‌ను తాకుతుందని, తన కెరీర్‌లో అతి త్వ‌ర‌గా సంత‌కం చేసిన ప్రాజెక్ట్ ఇదేనని ఆయన చెప్పాడు.

ఈ సినిమా ప్రేక్షకులను న‌వ్వించ‌డంతో పాటు ఏడిపిస్తుందని ఆయన తెలిపాడు. ఈ సినిమాలో తన చెల్లెళ్లు, సోదరుడిగా న‌టించిన వారికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. ఈ సినిమాను తన సోద‌రి అల్కాకి అంకిత‌మిస్తున్నానని చెప్పాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
akshay kumar
Bollywood
Viral Pics

More Telugu News