రాఖీ పండుగ స్పెషల్.. తన కొడుకు, కూతురి ఫొటో పోస్ట్ చేసిన మహేశ్ బాబు

Mon, Aug 03, 2020, 11:49 AM
Mahesh Babu  Celebrate the eternal bond of love
  • ఇంట్లో కార్పెట్ పై కూర్చున్న గౌతం, సితార 
  • శాశ్వతమైన ప్రేమ బంధానికి రాఖీ పండుగ ప్రతీకన్న మహేశ్
  • రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన హీరో
  • ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని పిలుపు
రాఖీ పండుగ సందర్భంగా సినీనటుడు మహేశ్ బాబు తన కూతురు, కుమారుడి ఫొటోను పోస్ట్ చేశారు. ఇంట్లో కార్పెట్ ఫై కూర్చొని గౌతం, సితార దిగిన ఈ ఫొటో మహేశ్ బాబు అభిమానులను అలరిస్తోంది. శాశ్వతమైన ప్రేమ బంధం, రక్షణ, జాగ్రతలకు ప్రతీకైన ఈ పండుగను జరుపుకుంటున్నామని చెప్పారు.

'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని మహేశ్ బాబు పేర్కొన్నారు. కాగా, రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement