TRS: ఎమ్మెల్సీ నారదాసు, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా

TRS MLC Naradasu Laxman and family Infected to Coronavirus
  • నారదాసు ఇంట్లో మొత్తం 8 మందికి కరోనా
  • హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న నారదాసు కుటుంబం
  • పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి కూడా పాజిటివ్

టీఆర్ఎస్ నేత, కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్సీ నారదాసు లక్షణ్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. లక్ష్మణ్ డ్రైవర్, ఇద్దరు గన్‌మన్లు, ఇంట్లోని పనివారికి కూడా కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. మొత్తం 8 మందికి కరోనా సోకినట్టు తేలింది. ప్రస్తుతం నారదాసు కుటుంబం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, టీఆర్ఎస్‌కే చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా నిన్న కరోనా బారినపడ్డారు.

  • Loading...

More Telugu News