Sonu Sood: సోనూ సూద్ ‘హీరో’ అవుతాడని ‘పూరి’కి ముందే ఎలా తెలిసిందబ్బా!

How do Puri Jagannadh knows Soun Sood becomes Hero
  • వైరల్ అవుతున్న ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని క్లిప్
  • హీరోను తానేనంటూ సోను డైలాగ్
  • సోనూ సూద్ ఎప్పుడూ హీరోనే అంటూ పూరి రిప్లై
అవును.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే వైరల్ అవుతోంది. విలన్ వేషాలు వేసే సోనూ సూద్ ‘హీరో’ అవుతాడని దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ముందు ఎలా తెలిసిందని ప్రశ్నిస్తూ ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని క్లిప్ ఇది. ఇందులో కోపంగా ఉన్న సోనూ సూద్ బ్రహ్మానందం చెంపపై లాగిపెట్టి కొడుతూ.. ‘‘నువ్వు ఆ రోజు నన్ను విలన్ అన్నావు. కానీ విలన్ వాడు బ్రహ్మాజీ. నేను హీరోను’’ అని చెబుతాడు.

ఈ వీడియోను పోస్టు చేసిన నెటిజన్లు.. సోనూ సూద్ ఎప్పటికైనా జనంతో హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టు ఉందని ప్రశంసించారు. దీనికి పూరి స్పందిస్తూ.. ‘‘నాకు తెలుసు.. సోనూ సూద్ ఎప్పుడూ హీరోనే’’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Sonu Sood
Puri Jagannadh
Hero
villain
Ek Niranjan

More Telugu News