ఒక గొడుగు... ఆరుగురు చిన్నారులు!.... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే!

02-08-2020 Sun 20:37
  • నేడు వరల్డ్ ఫ్రెండ్షిప్ డే
  • సోషల్ మీడియాలో హోరెత్తుతున్న శుభాకాంక్షలు
  • చిన్నారుల వీడియోను షేర్ చేస్తున్న ప్రముఖులు
Video of kids in an umbrella viral on Social Media
ఇవాళ అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు దర్శనమిస్తున్నాయి. వీటన్నింటి మధ్య ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక్కోసారి సాధారణ వీడియోలు సైతం అద్భుతమైన సందేశాన్నిస్తాయి. ఇప్పుడీ వీడియో ఫ్రెండ్షిప్ డే స్ఫూర్తిని చాటుతోందంటూ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దీన్ని షేర్ చేస్తూ స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఒక గొడుగులో ఆరుగురు చిన్నారులు పుస్తకాలు, పలకలు పట్టుకుని స్కూలుకు వెళ్లడం చూడొచ్చు. ఒకరు లేక ఇద్దరు పట్టే గొడుగులో వర్షం పడుతున్న వేళ అంతమంది పిల్లలు వెళ్లడం వాళ్ల మధ్య అందమైన చెలిమికి నిదర్శనం అంటూ నెటిజన్లు ఈ వీడియోకి నీరాజనాలు పడుతున్నారు.