Amitabh Bachchan: చివరి టెస్టులో కరోనా నెగెటివ్... ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్

Amitabh Bachchan cures from corona and discharged from hospital
  • ఇటీవలే కరోనా బారినపడిన అమితాబ్
  • ముంబయి ఆసుపత్రిలో చికిత్స
  • తన తండ్రిని డిశ్చార్జి చేశారని వెల్లడించిన అభిషేక్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు శుభవార్త! అమితాబ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. చివరిగా నిర్వహించిన కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. దాంతో అమితాబ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిషేక్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. తన విషయం గురించి చెబుతూ, ఇతర లక్షణాల కారణంగా తాను కొంతకాలం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోందని మరో ట్వీట్ లో తెలిపారు. ఇప్పటికీ తనకు కరోనా పాజిటివ్ అనే వస్తోందని వివరించారు.

ఇటీవలే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య కరోనా బారినపడ్డారు. దాంతో వారిని ముంబయి నానావతి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఐశ్యర్యా, ఆరాధ్య కోలుకున్నారు. తాజాగా అమితాబ్ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం అభిషేక్ ఒక్కడే చికిత్స పొందుతున్నాడు.
Amitabh Bachchan
Discharge
Corona Virus
Negative
Mumbai

More Telugu News