Sharwanand: ఫ్రెండ్షిప్ డే... రామ్ చరణ్ తో ఉన్న ఫొటోలు పంచుకున్న శర్వానంద్

Sharwanand shares pics with Ram Charan on Friendship Day
  • ఇవాళ అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం
  • చరణ్ తో తన స్నేహాన్ని చాటిన శర్వానంద్
  • ఎన్నో ఏళ్లుగా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్
ఇవాళ అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ సోషల్ మీడియాలో స్పందించారు. తన ప్రియమిత్రుడు రామ్ చరణ్ తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. తమ స్నేహాన్ని చాటే విధంగా ఉన్న ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. రామ్ చరణ్, శర్వానంద్ ల మధ్య స్నేహం ఈనాటిది కాదు. ఇద్దరికీ బాల్యం నుంచి స్నేహం ఉంది. అంతేకాదు, ఇద్దరూ అయ్యప్ప భక్తులే. ఎప్పుడు మాలధారణ చేసినా ఇద్దరూ కలిసే దీక్ష స్వీకరిస్తుంటారు.
 
Sharwanand
Ramcharan
Photos
Friendship Day
Tollywood

More Telugu News