హైదరాబాదులో విషాదం... కరోనా భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

01-08-2020 Sat 18:39
  • ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో ఘటన
  • తమకు కరోనా సోకిందని భావించిన దంపతులు
  • తమ వల్ల కుటుంబ సభ్యులకు సోకకూడదని భావించి ఆత్మహత్య
Old age couple dies of corona scare in Hyderabad
కరోనా సోకిందన్న భయంతో వృద్ధ దంపతులు బలవన్మరణం చెందడం హైదరాబాదులో విషాదం కలిగించింది. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో నివసించే ఈ వృద్ధ దంపతులు తమకు కరోనా సోకిందని భావించారు. తమ వల్ల ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందకూడదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కూల్ డ్రింకులో పురుగుల మందు కలిపి తాగి ప్రాణాలు వదిలారు. ఈ ఘటనతో హైదరాబాదులోని ఎంఎస్ మక్తాలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.