Amar Singh: సీనియర్ రాజకీయవేత్త అమర్ సింగ్ కన్నుమూత

  • కిడ్నీ సంబంధిత కారణాలతో మృతి చెందిన అమర్ సింగ్
  • సింగపూర్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్న మాజీ ఎస్పీ నేత
  • అమర్ సింగ్ వయసు 64 ఏళ్లు
Rajya Sabha member Amar Singh dies at 64

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ తుదిశ్వాస విడిచారు. 64 ఏళ్ల అమర్ సింగ్ కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గత మార్చ్ లో చికిత్స కోసం ఆయన సింగపూర్ ఆసుపత్రికి కూడా వెళ్లారు. అమర్ సింగ్ మృతితో రాజకీయ నేతలు షాక్ కు గురయ్యారు.

సమాజ్ వాదీ పార్టీలో అప్పట్లో అత్యంత కీలకమైన నేతగా ఉన్న అమర్ సింగ్... 2008లో యూపీఏ ప్రభుత్వానికి సమాజ్ వాదీ పార్టీ మద్దతును ప్రకటించడంలో కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత పార్టీతో విభేదాలు నెలకొనడంతో... ఎస్పీ నుంచి ఆయన బయటకు వచ్చారు. అమర్ సింగ్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

More Telugu News