Manikyala Raol: తిరిగొస్తానంటూనే తిరిగిరాని లోకాలకు... మాణిక్యాలరావు చివరి ట్వీట్ ఇదే!

Manikyala Rao tweeted last time as he will be come back with strength
  • కరోనాతో కన్నుమూసిన మాణిక్యాలరావు
  • తన గురించి ఆందోళన చెందవద్దంటూ ఇటీవల ట్వీట్
  • వదంతులు నమ్మవద్దని అభిమానులకు సూచన
ఏపీ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో కన్నుమూశారు. ఇటీవలే ఆయన తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడదే ఆయన చివరి ట్వీట్ అయింది. తనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తానని అభిమానులు, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కానీ విధిరాత మరోలా ఉండడంతో ఆయన తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు!

ఇటీవలే మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భీమ శంకరరావు (తాతాజీ)తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఆ తర్వాత శంకరరావుకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మాణిక్యాలరావు తాను కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 20 రోజుల పాటు ఏలూరు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే శ్వాస అందకపోవడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకువచ్చారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన మృత్యువాత పడ్డారు.

Manikyala Raol
Death
Corona Virus
Tweet
BJP
Andhra Pradesh

More Telugu News