విశాఖలో క్రేన్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

Sat, Aug 01, 2020, 02:46 PM
TDP Chief Chandrababu responds on crane accident at Hindusthan Ship Yard in Vizag
  • హిందూస్థాన్ షిప్ యార్డులో ప్రమాదం
  • 10 మంది మృతి!
  • భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్
విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్ యార్డులో ఓ భారీ క్రేన్ కూలి పది మంది చనిపోయారన్న వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోందని, వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ మధ్యాహ్నం విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో క్రేన్ కింద నలిగిపోయి పలువురు మృత్యువాత పడ్డారు. క్రేన్ కింద ఇంకా కొందరు ఉన్నట్టు భావిస్తున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad