Dharmana Krishna Das: విశాఖలో రాజధాని పనులకు ఆగస్టు 15న శంకుస్థాపన!: డిప్యూటీ సీఎం ధర్మాన వెల్లడి

Dharmana Krishnadas tells Visakha capital works will be start in shortly
  • ఏపీలో మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం
  • విశాఖలో కార్యనిర్వాహక రాజధాని
  • శ్రావణ మాసంలోనే పనులు ప్రారంభం అవుతాయన్న ధర్మాన
ఏపీలో మూడు రాజధానులకు గవర్నర్ రాజముద్ర పడడంతో వైసీపీ సర్కారులో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ఖాయమవడంతో ఉత్తరాంధ్ర నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందిన ధర్మాన కృష్ణదాస్ విశాఖ రాజధాని అంశంపై స్పందించారు.

శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు మంచి నిర్ణయం వెలువడిందని తెలిపారు. విశాఖలో రాజధాని పనులకు బహుశా ఆగస్టు 15న శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ధర్మాన పేర్కొన్నారు. వికేంద్రీకరణతో మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. విశాఖ అభివృద్ధి చెందేందుకు సహజసిద్ధంగా అనేక వనరులు ఉన్నాయని, ఈ విషయంలో టీడీపీ ఆరోపణలు సహేతుకం కాదని స్పష్టం చేశారు.
Dharmana Krishna Das
Vizag
AP Capital
August 15
YSRCP
Andhra Pradesh

More Telugu News