Nimmagadda Ramesh: సోమవారం బాధ్యతలను స్వీకరించనున్న నిమ్మగడ్డ రమేశ్.. ఏపీలో సర్వత్ర ఆసక్తి!

Nimmagadda Ramesh to take charge as SEC on monday
  • సోమవారం ఉదయం 10.30 గంటలకు బాధ్యతల స్వీకరణ
  • గతంలోని ఛాంబర్ లోనే బాధ్యతల నిర్వహణ
  • అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హైకోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేశ్ ను ఏపీ ప్రభుత్వం మళ్లీ ఎస్ఈసీగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆయన బాధ్యతలను స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. విజయవాడ బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విధులు నిర్వహించిన ఛాంబర్ లోనే ఇప్పుడు కూడా బాధ్యతలను చేపట్టనున్నారు. మరోవైపు ఆయన తిరిగి నియమితులు కావడంతో ఏపీలో ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
Nimmagadda Ramesh
SEC
Andhra Pradesh

More Telugu News