ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృ వియోగం.

Sat, Aug 01, 2020, 11:49 AM
shekar kammula father passes away
  • శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య (89)
  • ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో కన్నుమూత
  • సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89)  ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు పైబడటంతో గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.  కమ్ముల శేషయ్య  మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప‌లువు‌రు సినీ ప్ర‌ముఖుల శేఖ‌ర్ క‌మ్ముల‌ను ఫోన్ ద్వారా ప‌రామ‌ర్శించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad