Corona Virus: దేశంలో ఒక్కరోజులో 57,117 మందికి కొత్తగా కరోనా

India reports a new high of 57117 Confirmed Corona cases
  • మొత్తం కేసులు 16,95,988
  • మృతుల సంఖ్య మొత్తం 36,511
  • 5,65,103  మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారి సంఖ్య 10,94,374  
దేశంలో కొవిడ్‌-19 కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 57,117 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 764 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 16,95,988కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 36,511కి పెరిగింది. 5,65,103  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,94,374 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు మొత్తం 1,93,58,659 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 5,25,689 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
Corona Virus
COVID-19
India

More Telugu News