'బిగ్ బాస్ 4' ప్రోమో సిద్ధం.. త్వరలో ప్రసారం!

Sat, Aug 01, 2020, 09:36 AM
Promo of Bigg Boss 4 is ready for telecast
  • తెలుగులో ఆదరణ తెచ్చుకున్న బిగ్ బాస్ షో 
  • తాజా సీజన్ కి కూడా హోస్టుగా నాగార్జున
  • ఇటీవలే చిత్రీకరించిన ప్రోమో
'బిగ్ బాస్ 4' సీజన్ వచ్చేస్తోంది!
తెలుగు రియాలిటీ షోలలో ఓ ప్రత్యేకతను .. ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణను దక్కించుకున్న ఈ షో నాలుగో ఎడిషన్ కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత సీజన్ కి హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జునే ఇప్పుడు తాజా సీజన్ కి కూడా హోస్ట్ చేస్తున్నారు.

ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ ఇటీవల జరిగింది. హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ ప్రోమోను చిత్రీకరించారు. దీనికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ (సోగ్గాడే చిన్ని నాయన ఫేం) దర్శకత్వం వహించగా, ప్రముఖ కెమెరామేన్ కె.కె.సెంథిల్ కుమార్ ఈ ప్రోమోను చిత్రీకరించడం జరిగింది. ప్రభుత్వ కొవిడ్ నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రతా చర్యల నేపథ్యంలో దీనిని షూట్ చేశారు.

ఇక త్వరలోనే ఈ ప్రోమోను టీవీలలో ప్రసారం చేస్తారని సమాచారం. అలాగే, మరోపక్క ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీల ఎంపిక కూడా దాదాపు పూర్తయిందట. త్వరలోనే చిత్రీకరణ కూడా మొదలవుతుంది. ఈ నెలాఖరు నుంచి షోని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad