Dog: అమెరికాలో కరోనా సోకిన కుక్క మృతి... మరణానికి ముందు కుక్కలో క్యాన్సర్ లక్షణాలు!

  • శునకం యజమానికి కరోనా
  • ఆ తర్వాత కుక్కకి కూడా పాజిటివ్
  • శునకం మరణానికి కారణంపై అనిశ్చితి
Corona infected dog died in USA

అమెరికాలో ఓ శునకం కరోనా బారినపడగా, ఆపై అది కన్నుమూసింది. న్యూయార్క్ కు చెందిన ఓ వ్యక్తి జర్మన్ షెపర్డ్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, కొన్నిరోజులకే కుక్క కూడా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడడం గుర్తించారు. ఆ కుక్కకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే కొన్నిరోజుల తర్వాత ఆ జర్మన్ షెపర్డ్ జాతి కుక్క మరింత నీరసించింది. ఆరోగ్యం క్షీణించి మరణించింది.

అయితే, మరణానికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ శునకంలో క్యాన్సర్ లక్షణాలను కూడా గుర్తించారు. ఇప్పుడా కుక్క చనిపోయింది కరోనాతోనా? లేక క్యాన్సర్ తోనా? అనేది అనిశ్చితిగా మారింది. కాగా, ఆ కుక్కకు మరిన్ని పరీక్షలు చేసే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ అధికారులు వెళ్ళేసరికే దానికి అంత్యక్రియలు చేసేసినట్టు యజమాని తెలిపాడు.

More Telugu News