Online: లాక్ డౌన్ రోజుల్లో భారతీయులు ఆన్ లైన్ లో ఎక్కువగా కొనుగోళ్లు జరిపింది ఇవే!

  • లాక్ డౌన్ లో ఇళ్లకే పరిమితమైన జనాలు
  • దుకాణాలు మూసివేయడంతో ఆన్ లైన్ షాపింగ్ కు మొగ్గు
  • కిరాణా కొనుగోళ్లు జరిపిన అత్యధికులు
A study says Indians mostly bought through online

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గత మార్చి చివరి నుంచి లాక్ డౌన్ కొనసాగిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ రోజుల్లో చాలావరకు దుకాణాలు మూసివేయడం, ప్రజలు బయట తిరిగేందుకు వీలుకాకపోవడంతో అత్యధికులు ఆన్ లైన్ షాపింగ్ కు మొగ్గు చూపారు. తాజాగా ఓ అధ్యయనంలో భారతీయులు లాక్ డౌన్ రోజుల్లో ఎక్కువగా ఏమేమి కొన్నారో వెల్లడించింది.

అత్యధికంగా కిరాణా వస్తువులు కొన్నారట. సాధారణంగా దుకాణాల్లో కొనుగోలు చేసే నిత్యావసరాలను కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇచ్చారట. ఇక ఆ తర్వాత స్థానంలో దుస్తుల కొనుగోళ్లకు ఎక్కువమంది మొగ్గు చూపినట్టు తేలింది. ఆన్ లైన్ దుస్తులు కాబట్టి ఎక్కువగా యువతే ఆర్డర్లు బుక్ చేసినట్టు భావించవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులపై ఖర్చు చేసినట్టు అధ్యయనంలో పేర్కొన్నారు. సాధారణంగా ఔషధాలను దుకాణాల్లో తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడతారు. అయితే లాక్ డౌన్ పరిస్థితులు వారిని ఆన్ లైన్ బాట పట్టించాయి. ఈ క్రమంలో చాలామంది ఆన్ లైన్ లోనే మందులు కొనుక్కున్నట్టు అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు, ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎక్కవగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన రంగాలు కూడా ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. వాహనాల గురించి అత్యధికంగా 60 శాతం మంది ఆన్ లైన్ లో సెర్చ్ చేయగా, 40 శాతం మంది ప్రయాణాలు, టికెట్ బుకింగ్ ల గురించి వెదికారట!

More Telugu News