రెయిన్ బో రీల్స్ బ్యానర్లో నిఖిల్ కొత్త సినిమా

Fri, Jul 31, 2020, 04:32 PM
Nikhil new movie confirmed under Rainbow Reels banner
  • ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో నిఖిల్
  • ఎస్వీసీఎల్ఎల్ పీ సమర్పణలో రానున్న తాజా చిత్రం
  • త్వరలోనే దర్శకుడు, తారాగణం వివరాలు
ఇటీవలే లాక్ డౌన్ రోజుల్లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన హీరో నిఖిల్ కొత్త సినిమా అంగీకరించాడు. రెయిన్ బో రీల్స్ సంస్థ నిర్మాణంలో నిఖిల్ 20వ చిత్రం తెరకెక్కనుంది. నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రానికి నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ (ఎస్వీసీఎల్ఎల్ పీ) సమర్పణలో వస్తున్న నిఖిల్ కొత్త సినిమాకు దర్శకుడు, ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ-2, 18 పేజీస్ చిత్రాలు చేస్తున్నాడు. వీటి తర్వాత రెయిన్ బో రీల్స్ నిర్మాణంలో సినిమా ఉండనుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad