Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 129 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 28 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన సన్ ఫార్మా
Sensex ends 129 points lower

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం... అంతర్జాతీయ మార్కెట్లు కూడా నిరాశాజనకంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టపోయి 37,606కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 11,073 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (4.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.63%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.49%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.45%), యాక్సిస్ బ్యాంక్ (1.36%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.98%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.69%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.55%), ఏసియన్ పెయింట్స్ (-1.52%), బజాజ్ ఆటో (-1.45%).

More Telugu News