Anupama: అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మరో సినిమా

Anupama Parameshvaran opposite Nikhil
  • తెలుగులో పెద్దగా ఊపందుకోని అనుపమ కెరీర్ 
  • తాజాగా నిఖిల్ సరసన నటించే ఛాన్స్
  • పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్'
మల్లూ బేబీ అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం కలిగిన నటి. అయితే, తెలుగులో ఏవో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు. స్టార్ హీరోల సినిమాలలో నటించే ఛాన్సులు సరిగా రాలేదు. అప్పుడప్పుడు ఒక్కో సినిమా.. అన్నట్టుగా తెలుగులో ఆమె ప్రస్థానం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. యువ కథానాయకుడు నిఖిల్ సరసన ఆమె నటించనుంది.

ప్రస్తుతం నిఖిల్ కథానాయకుడుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. '18 పేజెస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు లాంఛనంగా మొదలైంది కూడా. ఇక ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం పలువుర్ని పరిశీలించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారు.
Anupama
Nikhil
Sukumar
18 Pages

More Telugu News