రేసింగ్ అభిరుచి ఉన్న బాలుడికి సైకిల్ కొనిచ్చి ప్రోత్సహించిన రాష్ట్రపతి కోవింద్

Fri, Jul 31, 2020, 03:15 PM
President Ramnath Kovind presents a cycle for a young racer
  • రాష్ట్రపతి దృష్టిని ఆకర్షించిన 9వ తరగతి బాలుడు  రియాజ్
  • చాంపియన్ గా నిలిచేందుకు కఠోర సాధన
  • ఖరీదైన సైకిల్ బహూకరించి ఆశీర్వదించిన రాష్ట్రపతి
రియాజ్ అనే బాలుడు సైక్లింగ్ చాంపియన్ గా నిలవాలని కఠోర సాధన చేస్తున్న విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆ బాలుడికి ఓ రేసింగ్ సైకిల్ కానుకగా అందించారు. రియాజ్ ఢిల్లీలోని సర్వోదయ బాల విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. రియాజ్ ఓవైపు చదువుకుంటూనే రేసింగ్ కు అవసరమైన డబ్బు కోసం ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ విషయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి వెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ బాలుడికి ఖరీదైన రేసింగ్ సైకిల్ కొనిచ్చారు. రేసింగ్ లో ఉన్నతస్థానం అందుకోవాలని ఆ బాలుడ్ని ఆశీర్వదించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad