బన్నీతో కొరటాల శివ... అదిరిపోయే కాంబినేషన్ ఖరారు!

Allu Arjun next movie with Koratala Siva confirmed
  • చాలాకాలంగా ఈ చిత్రం గురించి ప్రచారం
  • అధికారికంగా ప్రకటించిన గీతాఆర్ట్స్-2
  • బహుభాషా చిత్రంగా బన్నీ 21వ సినిమా
అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ గురించి చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నా, ఇన్నాళ్లకు అఫిషియల్ ప్రకటన వచ్చింది. అల్లు అర్జున్ 21వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. గీతాఆర్ట్స్-2, యువసుధ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సామాజిక అంశాలను సినిమా ఇతివృత్తాలుగా మలిచి ప్రేక్షకులను ఆకట్టుకునే కొరటాల ఇప్పుడు బన్నీని ఎలా చూపిస్తాడన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా గురించి గీతాఆర్ట్స్-2 ట్విట్టర్ లో స్పందించింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఖరారు అయిందని, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ కొరటాల శివ ఓ బిగ్గెస్ట్ ఎంటర్టయినర్ కోసం కలిసి పనిచేస్తున్నారని వెల్లడించింది. ఈ చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించింది.

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తన 21వ చిత్రం ప్రకటనపై స్పందించారు. ఈ సినిమా ప్రకటిస్తుండడం పట్ల చాలా సంతోషంగా ఉందని, కొరటాల శివతో చిత్రం చేయనుండడం ఎంతో ఉద్విగ్నత కలిగిస్తోందని పేర్కొన్నారు. కొంతకాలం నుంచి ఈ సినిమా ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందా అని ఎదురుచూశానని వెల్లడించారు. నిర్మాతగా తొలి సినిమా తీస్తున్న మిక్కిలినేని సుధాకర్ కు శుభాకాంక్షలు అంటూ బన్నీ ట్వీట్ చేశారు.

ఈ చిత్రం నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఇతరులను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ...  "శాండీ, స్వాతి, నట్టి... మీపై నేను ప్రేమను చూపించే విధానం ఇలా ఉంటుంది" అంటూ బన్నీ పేర్కొన్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శాండీ, నట్టి, స్వాతి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా, బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రం చేస్తున్నారు. 'పుష్ప' చిత్రీకరణ పూర్తయిన వెంటనే కొరటాల శివతో చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Go Back to Shorts
Allu Arjun
Koratala Siva
AA21
GA2
Tollywood

More Telugu News