Samantha: ఈ పరిస్థితులే నాకు ఓ పాఠాన్ని నేర్పాయి: హీరోయిన్ సమంత

samanta explains why she has turn as a former during lockdown
  • లాక్‌డౌన్‌తో భయపడిపోయాం
  • భర్తతో సూపర్‌మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొనుక్కున్నా
  • ఒకవేళ అవి అయిపోతే ఎలాగని ఆందోళన చెందాను
  • అందుకే స్వయంగా కూరగాయలు పండిస్తున్నాను
లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లో చేస్తోన్న పనుల గురించి సమంత ఆసక్తకర విషయాలు వివరించి చెప్పింది.  అందరూ తమకు నచ్చిన పనిని సమర్థంగా చేయడానికి ఇష్టపడతారని, సృజనాత్మకతకు కొదవలేదని చెప్పింది. డ్యాన్స్‌, వంట చేయడం, కవిత్వం రాయడం లాంటి పనులు ఎన్నో చేస్తారని తెలిపింది.

అయితే, వాటిని తాను చేయలేనని తనకు తెలుసని సమంత చెప్పింది. ప్రతి ఒక్కరూ చేసే దానికి తాను కాస్త భిన్నంగా చేయాలని అనుకుంటానని వివరించింది. చాలా సులభమైన తోటపనికి సంబంధించి తాను సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో పోస్ట్‌లు చేశానని చెప్పింది.

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ ప్రకటించగానే అందరిలాగే తానూ ఆశ్చర్యపోయానని, ఆందోళన చెందానని చెప్పింది. సరకుల కోసం తన భర్తతో కలిసి తాను సూపర్‌మార్కెట్‌కు పరిగెత్తానని చెప్పింది. ఇలా చాలా మంది చేసి ఉంటారని తెలిపింది. తెచ్చుకున్న సరకులన్నీ ఎన్ని రోజులు వస్తాయో లెక్కపెట్టామని, ఒకవేళ అవన్నీ అయిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఊహించుకుని ఆందోళన చెందామని చెప్పింది.

మనకు పోషకాలతో కూడిన ఆహారం లేదని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితులే తనకు ఓ పాఠాన్ని నేర్పాయని చెప్పింది.  అవసరమైన ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పింది. తాము పండిస్తోన్న కూరగాయలతో సమంత ఇటీవల దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి,.
Samantha
Tollywood
Lockdown
Lockdown Diaries

More Telugu News