Telangana: తెలంగాణలో ఏమాత్రం తగ్గని కొవిడ్ ఉద్ధృతి.. నిన్న రికార్డుస్థాయిలో కేసుల నమోదు

  • నిన్న ఒక్క రోజే 1,986 కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 586 కేసులు
  • 14 మంది మృతి చెందడంతో 519కి పెరిగిన మృతుల సంఖ్య
1986 corona cases records in telangana yesterday

తెలంగాణలో కొవిడ్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న రికార్డు స్థాయిలో 1,986 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. అలాగే, నిన్న 14 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా ఇప్పటి వరకు కరోనా కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 519కి పెరగ్గా, కేసుల సంఖ్య 62,703కి పెరిగింది. తాజా కేసుల్లో 586 జీహెచ్ఎంసీ పరిధిలో వెలుగు చూశాయి.

కొవిడ్ నుంచి కోలుకుని నిన్న 816 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 45,388కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 16,796 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 10,632 మంది హోం, ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒక్క రోజే 21,380 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,216 మంది  ఫలితాలు రావాల్సి ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,37,582 మందికి పరీక్షలు నిర్వహించారు.

More Telugu News