బాలయ్య తదుపరి సినిమా ఇదేనా?

Fri, Jul 31, 2020, 08:48 AM
Anil Ravipoodi to direct Balakrishna
  • ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ మూడవ చిత్రం
  • లాక్ డౌన్ కారణంగా షూటింగుకి తాత్కాలిక బ్రేక్
  • బాలయ్య కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడవ చిత్రాన్ని చేస్తున్నారు. యాక్షన్ మూవీస్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న బోయపాటి ఈ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో తన స్టయిల్ ఆఫ్ మేకింగ్ తో రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది. అయితే, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఈ చిత్రం షూటింగుకి కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది. కరోనా పరిస్థితులు కుదుటపడ్డాక ఇది మళ్లీ మొదలవుతుంది.

ఈ నేపథ్యంలో.. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ చేయబోయే తదుపరి చిత్రం గురించి తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే, 'ఎఫ్ -2', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న దర్శకుడు అనిల్ తాజాగా ఆయన కోసం ఓ కథను సిద్ధం చేశాడట. త్వరలోనే బాలయ్యతో స్క్రిప్టుకి ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఆయన వున్నారని సమాచారం.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad