కరోనా నుంచి కోలుకున్న అంబటి రాంబాబు... ఇంటికొచ్చేశానంటూ ట్వీట్

Thu, Jul 30, 2020, 09:39 PM
Ambati Rambabu cured from Corona and discharged
  • కొన్నిరోజుల కిందట అంబటికి కరోనా పాజిటివ్
  • ఇవాళ డిశ్చార్జి అయ్యానంటూ అంబటి వెల్లడి
  • పేరుపేరునా ధన్యవాదాలు
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. "మీ అందరి ఆశీస్సుల వల్ల కోలుకున్నాను. కరోనా సోకడంతో 10 రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకుని నెగెటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యి ఈరోజే ఇంటికి వచ్చాను. అయితే ఓ వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad