Undavalli Arun Kumar: కరోనాపై గెలిచే బలాన్ని జగన్ కు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా: ఉండవల్లి

  • కరోనా బారిన పడితే జీవించలేమని పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు
  • ఫంక్షన్ హాళ్లను ట్రస్టులు, ఎన్జీవోలకు అప్పగించాలి
  • ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా పరీక్షలకు అనుమతించాలి
Undavalli Arun Kumar writes a letter to Jagan on Corona virus

కరోనాపై చేస్తున్న యుద్ధంలో గెలిచేందుకు ముఖ్యమంత్రి జగన్ కు బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన జగన్ కు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. కరోనా బారిన పడితే జీవించలేమనే ఆవేదనలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారని చెప్పారు.

కరోనా రోగుల కోసం తాత్కాలిక సహాయ కేంద్రాలను నడపాలని... దీని కోసం ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ట్రస్టులు, ఎన్జీవోలకు అప్పగించాలని సూచించారు. ఈ కేంద్రాలకు అయ్యే నిర్వహణ ఖర్చును ట్రస్టులు, ఎన్జీవోలు భరిస్తాయని... ప్రభుత్వం వైపు నుంచి వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే ఒక ఫంక్షన్ హాల్ ను రాజమండ్రిలోని జైన్ సంఘం అద్దెకు తీసుకుందని... అందులో 60 పడకలతో ఒక కరోనా సెంటర్ ను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కరోనా పరీక్షలకు అనుమతించాలని... వాటికి ఫీజును నిర్దేశించాలని చెప్పారు.

More Telugu News