ఓ ముఠా ట్రాప్ లో చిక్కుకుని పెళ్లి వరకు వెళ్లి బయటపడ్డాను: హీరోయిన్ పూర్ణ

Thu, Jul 30, 2020, 05:09 PM
Actress Poorna revealed how a gang cheated
  • పెళ్లి పేరుతో పూర్ణ కుటుంబాన్ని సంప్రదించిన ముఠా సభ్యులు
  • అన్ని విషయాలు మాట్లాడుకున్నాక నిజస్వరూపం తెలిసిందన్న పూర్ణ
  • పెళ్లంటేనే భయం వేస్తోందని వెల్లడి
'అవును' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ భామ పూర్ణ (షామ్నా ఖాసిమ్)ను ఓ ముఠా పెళ్లి పేరుతో మోసం చేయగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన భయానక అనుభవం గురించి పూర్ణ వెల్లడించారు. ఓ ముఠా తనను పెళ్లి పేరిట ట్రాప్ చేసిందని, అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ ముఠా ఉచ్చు నుంచి బయటపడ్డానని తెలిపారు. తనకు పెళ్లి చేయాలన్న ఆలోచనతో తన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా, ఓ ముఠా తన తల్లిదండ్రులను సంప్రదించిందని పూర్ణ పేర్కొన్నారు.

"పెళ్లి దాదాపు నిశ్చయమైంది. అవతలి కుటుంబంతో మా అమ్మానాన్న మాట్లాడారు. నేను కూడా కాబోయే భాగస్వామితో భవిష్యత్ జీవితంపై ఆలోచనలు పంచుకున్నాను. ఆ తర్వాత ఊహించని పరిణామాలు జరిగాయి. ఆ ముఠా అంతరంగం అర్థమైంది. ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నట్టు నటించి మోసం చేశారు. ఈ ఘటనతో పెళ్లంటేనే భయం వేస్తోంది. మనుషులపై నమ్మకం పోతోంది. నాకు పెళ్లి సంబంధాలు చూడవద్దని మా అమ్మానాన్నలకు చెప్పేశాను" అని వివరించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad