Venkatrami Reddy: మాకు రాజకీయాలతో సంబంధం లేదు: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం

AP Secretariat Employs Association President Venkatrami Reddy explains their stand
  • ఉద్యోగులను పిటిషన్ లో చొప్పించారన్న సంఘం అధ్యక్షుడు
  • తమకు ఏ పార్టీ ముఖ్యం కాదని స్పష్టీకరణ
  • కోర్టుకు వాస్తవాలు వెల్లడించామని వివరణ
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని, తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా పిటిషన్లలో ఇంప్లీడ్ అవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఉద్యోగులను పిటిషన్ లో భాగం చేయడం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. అయితే, అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టుకు వాస్తవాలతో కూడిన జవాబు ఇచ్చామని వెల్లడించారు. తమకు ఏ పార్టీ ముఖ్యం కాదని, తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని తెలిపారు.
Venkatrami Reddy
AP Secretariat
Employs
AP High Court

More Telugu News