High Court: చైనాలో గబ్బిలాలు తినడం వల్లే కరోనా వచ్చిందంటున్నారు... బక్రీద్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు

  • బక్రీద్ దృష్ట్యా హైకోర్టు కీలక ఆదేశాలు
  • జంతువుల అక్రమ వధపై చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
  • ఒంటెల అక్రమరవాణా, వధపై పిటిషన్
  • విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు
Telangana high court orders state government illegal killing of animals

బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ దృష్ట్యా జంతువుల అక్రమ వధ జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. బక్రీద్ నేపథ్యంలో ఎవరైనా జంతువుల అక్రమవధకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలంటూ దాఖలైన పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిబంధనల ప్రకారమే జంతువధ జరగాలని స్పష్టం చేసింది.

అంతేకాదు, జంతుమాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనాలో గబ్బిలాలు తినడం వల్లే కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా ఉందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించింది. దాంతో, మాంసం దుకాణాలను తనిఖీ చేస్తున్నారా అని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించింది. ఈ వివరాలన్నింటితో రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News