ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావాలని కోరిన కేంద్రం

Thu, Jul 30, 2020, 02:18 PM
AP and Telanagana states chief ministers will be meet on water disputes
  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • కృష్ణా, గోదావరి జలాలపై కుదరని ఏకాభిప్రాయం
  • సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం
ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల కేటాయింపుల అంశంపై అనేక వివాదాలు తలెత్తాయి. ఈ జల ఫిర్యాదులపై కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ స్పందించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సమావేశం గురించి లేఖ రాశారు. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశామని, ఆ రోజున సీఎంలు అందుబాటులో ఉంటారా, లేదా అన్నది తమకు సమాచారం అందివ్వాలని ఆ లేఖలో కోరారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad