Mahesh Babu: రాజమౌళి సర్.. జాగ్రత్తగా ఉండండి: మహేశ్ బాబు

take care sir mahesh babu about rajamoul tests corona positive
  • దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌
  • వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్
  • త్వరగా కోలుకోవాలని మహేశ్ వ్యాఖ్య
సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్‌‌లో ఉంటున్నారు. ఆయన కుటుంబం కరోనా బారిన పడినప్పటికీ ప్రస్తుతం వారిలో ఎలాంటి లక్షణాలు లేవు.

రాజమౌళి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఆయనకు కరోనా రావడం పట్ల సినీ హీరో మహేశ్ బాబు స్పందిస్తూ రాజమౌళి చేసిన ట్వీట్‌కు కామెంట్ చేశాడు. 'జాగ్రత్తలు తీసుకోండి సర్.. మీరు, మీ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని మహేశ్ బాబు పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌, రామ చరణ్‌ తేజ్‌లతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా తీస్తున్నారు. అనంతరం మహేశ్ బాబుతోనే ఆయన సినిమా చేయనున్నారు.
Mahesh Babu
Rajamouli
Tollywood

More Telugu News