Rakul Preet Singh: ప్రతి రోజు భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది: రకుల్ ప్రీత్ సింగ్

Corona taught us many lessons says Rakul Preet Singh
  • ఈ సంవత్సరమంతా ఇబ్బందులతోనే సాగుతోంది
  • కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పింది
  • రాబోయే రోజుల్లో మరిన్ని విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది
2020 సంవత్సరమంతా ఇబ్బందులతోనే కొనసాగుతోందని... ప్రతి రోజు భయాందోళనలతోనే బతకాల్సిన పరిస్థితి తలెత్తిందని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం కష్టాల్లోకి జారుకుందని, ఈ కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పిందని చెప్పింది. ప్రతి ఒక్కరం స్వీయ రక్షణను, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామని సూచించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

రానున్న రోజుల్లో మరిన్ని విపత్తులు, రోగాలు, యుద్దాలను ప్రపంచం ఎదుర్కోవాల్సి ఉంటుందని రకుల్ చెప్పింది. ఎలాంటి ఆపదలు మన దరికి చేరవనే నమ్మకంతో జీవిద్దామని తెలిపింది. మనం ఇంకా జీవించి ఉన్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుందామని చెప్పింది. ఇంటి వద్దనే ఉంటూ కరోనా విస్తరణను నియంత్రిద్దామని సూచించింది.

కరోనా కారణంగా రకుల్ ఇంటికే పరిమితమైంది. ఇటీవలనే ఆమె హైదరాబాద్ చేరుకుంది. అయితే, ఇంకా షూటింగులు ప్రారంభం కాకపోవడంతో... ఆమె ఖాళీగానే ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అభిమానులలో కరోనాపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తోంది.
Rakul Preet Singh
Tollywood
Corona Virus

More Telugu News