ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.. జాన్వీకి ఛాన్స్?

Thu, Jul 30, 2020, 11:28 AM
Jhanvi Kapoor to pair with Junior NTR
  • 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేస్తున్న తారక్
  • ఈ చిత్రంలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు
  • జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు సమాచారం
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇందులో తారక్ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని చెపుతున్నారు.

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే, రష్మిక, సమంత ఈ ముగ్గురిలో ఒకర్ని ఎంపిక చేయనున్నారని సమాచారం. మరో హీరోయిన్ గా దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ పేరు వినిపిస్తోంది. జాన్వీని ఇప్పటికే ఎంపిక చేశారని కూడా ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad