COVID-19: దేశంలో తొలిసారి ఒక్కరోజులో కొత్తగా 50 వేలకు పైగా కరోనా కేసులు

Total number of COVID19 cases in India is now 1583792
  • గత 24 గంటల్లో భారత్‌లో 52,123 మందికి కరోనా
  • మొత్తం కేసులు 15,83,792
  • మృతుల సంఖ్య మొత్తం 34,968
  • 5,28,242 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 52,123 మందికి కొత్తగా కరోనా సోకింది. కరోనా కేసులు ఒక్కరోజులో 50 వేలు దాటడం ఇదే తొలిసారి. అదే సమయంలో 775 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 15,83,792కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,968కి పెరిగింది. 5,28,242 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10,20,582 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు మొత్తం 1,81,90,382 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,46,642 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
COVID-19
Corona Virus
India

More Telugu News