sand mafia: మహబూబ్‌నగర్‌లో దారుణం.. ఇసుక లారీని అడ్డుకున్న రైతును అదే లారీతో తొక్కించి చంపిన వైనం!

Sand mafia killed farmer with lorry in mahabubnagar
  • తన పొలం నుంచి ఇసుకను తరలించొద్దని వేడుకున్న రైతు
  • బోర్లు ఎండిపోయి నీళ్లు రావడం లేదని ఆవేదన
  • లారీతో తొక్కి చంపిన ఇసుక మాఫియా
మహబూబ్‌నగర్‌లో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. వ్యవసాయ పొలంలోని ఇసుకను తవ్వితీసి లారీలో తరలించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న ఓ రైతును అదే లారీతో తొక్కి చంపింది. రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తన పొలం నుంచి ఇసుకను తవ్వితీసి అక్రమంగా రవాణా చేస్తుండగా రైతు గుర్రంకాడ పోచయ్య (38) అడ్డుకున్నాడు. బోర్లు ఎండిపోయి మూడేళ్లుగా బోర్ల నుంచి చుక్క నీరు కూడా రావడం లేదని, దయచేసి ఇసుకను తరలించొద్దంటూ లారీని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక మాఫియా దౌర్జన్యానికి దిగడమే కాకుండా పోచయ్యను లారీతో ఢీకొట్టి హతమార్చింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇసుక మాఫియా కారణంగా గ్రామంలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
sand mafia
farmer
killed
Crime News
mahabubnagar

More Telugu News