neowise: 'నియోవైస్’ తోకచుక్కను కెమెరాలో బంధించిన వైజాగ్ అమ్మాయి

  • పూర్తిగా దుమ్ము, ధూళితో నిండి ఉన్న తోకచుక్క
  • ఈ ఏడాది మార్చిలో గుర్తించిన నాసా
  • కొన్ని రోజులపాటు కష్టపడి ఫొటో తీసిన భవ్య
Comet Neowise appeared in Visakha

ఆకాశంలో సందడి చేస్తున్న అత్యంత అరుదైన తోకచుక్క ‘కామెట్ నియోవైస్’ను విశాఖపట్టణం అమ్మాయి మొదిలి వైష్ణవి భవ్య తన కెమెరాలో ఎట్టకేలకు బంధించింది. దానిని ఫొటో తీసేందుకు కొన్ని రోజులపాటు ఆమె శ్రమపడ్డారు.

కొన్నిసార్లు వాతావరణం సహకరించక, మరికొన్నిసార్లు వాతావరణంలో ధూళి కణాల వల్ల ఇది సరిగా కనిపించేది కాదు. ఎండలు కాస్తూ వాతావరణం సహకరించడంతో ఈ నెల 26న శొంఠ్యాం రోడ్డులోని భైరవవాక వద్ద సూర్యాస్తమయ సమయంలో మొత్తానికి చిక్కింది. తోకచుక్క మిలమిలా మెరుస్తూ వెళుతున్న అద్భుతమైన దృశ్యాన్ని భవ్య తన కెమెరాలో బంధించింది.

కామెట్ నియోవైస్ తోకచుక్క  పూర్తిగా దుమ్ము, ధూళితో నిండి ఉంటుంది. భూమి ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఆకాశంలో కనువిందు చేస్తున్న ఈ తోకచుక్కను ఈ ఏడాది మార్చిలో నాసా తన నియోవైస్‌ ఉపగ్రహంలోని ఇన్‌ఫ్రారెడ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ద్వారా గుర్తించింది. ఇది అత్యంత అరుదైన తోక చుక్కని నాసా పేర్కొంది.

More Telugu News