సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

30-07-2020 Thu 07:18
  • వెబ్ సీరీస్ కి సంతకం చేసిన రకుల్
  • బ్రహ్మానందం పాత్రలో వెన్నెల కిశోర్
  • హిందీ వెబ్ సీరీస్ లో అఖిల్ అక్కినేని
Rakul signed for a web series produced by Krish
*  మిగతా హీరోయిన్లలానే కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సీరీస్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మించే ఓ వెబ్ సీరీస్ లో కథానాయిక పాత్ర పోషించడానికి రకుల్ తాజాగా సంతకం చేసినట్టు తెలుస్తోంది. దీనిని 'ఆహా' ఓటీటీ ప్లేయర్ కోసం నిర్మిస్తున్నారు.  
*  మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఢీ' చిత్రానికి ఇప్పుడు ఇదే కాంబినేషన్లో  సీక్వెల్ రూపొందుతోంది. అయితే, 'ఢీ' సినిమాలో బ్రహ్మానందం పోషించిన పాత్రకు ఇప్పుడు వెన్నెల కిశోర్ ని తీసుకుంటున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో నటిస్తున్న అక్కినేని అఖిల్ ఓ వెబ్ సీరీస్ లో నటించే అవకాశం కనిపిస్తోంది. ఒక హిందీ వెబ్ సీరీస్ లో ఓ కీలక పాత్ర కోసం అఖిల్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అఖిల్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదట.