Rajbhavan: ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో మరోమారు కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్

AP Raj Bhavan Security personnel infected to coronavirus
  • విషయం తెలిసి అప్రమత్తమైన అధికారులు
  • మొత్తం 72 మంది సిబ్బందినీ మార్చి కొత్త వారి నియామకం
  • రాజ్ భవన్‌ను శానిటైజ్ చేసిన అధికారులు
ఆంధప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో మరోమారు కరోనా కలకలం రేగింది. ఇక్కడ పనిచేస్తున్న వారిలో 15 మంది భద్రతా సిబ్బంది కరోనా బారినపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు అక్కడ పనిచేస్తున్న మొత్తం 72 మంది భద్రతా సిబ్బందిని ఒకేసారి మార్చారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. రాజ్‌భవన్‌ను శానిటైజ్ చేశారు. గతంలోనూ ఇక్కడ పనిచేసే పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా సోకింది.
Rajbhavan
Andhra Pradesh
security
Corona Virus

More Telugu News