Congress: అప్పటి మా ప్రభుత్వ నిర్ణయ ఫలాలు ఇవి: 'రాఫెల్ విమానాల' రాకపై కాంగ్రెస్

  • విమానాల రాకపై అభినందన
  • 2012లో తాము కుదుర్చుకున్న ఒప్పందం ఫలితమేనన్న కాంగ్రెస్
  • డీల్ విషయంలో బీజేపీపై విమర్శలు
UPA govts labour in identifying purchasing Rafale in 2012 finally bears fruit says Congress

అత్యాధునిక ఫైటర్ జెట్ విమానాలు రాఫెల్స్ రాకపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అప్పటి తమ ప్రభుత్వ నిర్ణయ ఫలాలు నేడు అందుతున్నాయని పేర్కొంది. రాఫెల్ విమానాల సామర్థ్యాన్ని తాము 2012లోనే గుర్తించి వాటి కొనుగోలుకు ప్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. తొలి బ్యాచ్‌లో భాగంగా నేడు 5 విమానాలు భారత్‌కు చేరుకోవడాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా వీటి ఒప్పందం విషయంలో మోదీ ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించింది.

మన్మోహన్‌సింగ్ సారథ్యంలోని అప్పటి తమ ప్రభుత్వం 126 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుందని, కానీ బీజేపీ దానిని కాదని కేవలం 36 జెట్లకే డీల్ కుదుర్చుకుందని, కాంగ్రెస్‌కు బీజేపీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని విమర్శించింది. నాటి డీల్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే నేడు 126 జెట్లు భారత్ అమ్ముల పొదికి చేరి ఉండేవని పేర్కొంది. తమ ఒప్పందం ప్రకారం 108 విమానాలు మన దగ్గరే తయారై ఉండేవని, 2016 నాటికే అన్ని విమానాలు వైమానిక దళంలో చేరి ఉండేవని వివరించింది. ఒక్కో విమానం రూ. 526 కోట్లకే దక్కి ఉండేదని కాంగ్రెస్ పేర్కొంది.

More Telugu News