Saipallavi: వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన సాయిపల్లవి

Sai Pallavi gives nod for web series
  • రెండు సినిమాలలో నటిస్తున్న సాయిపల్లవి 
  • వెట్రిమారన్ దర్శకత్వంలో వెబ్ సీరీస్
  • ప్రకాశ్ రాజ్ కి కూతురిగా సాయిపల్లవి
నేటి మన కథానాయికలలో సాయి పల్లవికి ఓ ప్రత్యేకత వుంది. ఆఫర్ల కోసం వెంపర్లాడదు. అసలు తనకు వచ్చిన అన్ని సినిమాలనూ కూడా ఒప్పుకోదు. కథ, అందులో తన పాత్ర నచ్చాలి. దానికి తోడు, 'నో ఎక్స్ పోజింగ్' వంటి కండిషన్లు కూడా పెడుతుంది. అందుకే, ఆమె చేస్తున్న సినిమాలు మనకు తక్కువగా కనిపిస్తుంటాయి.

అలాంటి సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' కాగా, మరొకటి రానా హీరోగా తెరకెక్కుతున్న 'విరాటపర్వం'. ఇప్పుడీ చిన్నది తాజాగా వెబ్ సీరీస్ లో కూడా నటించడానికి ఓకే చెప్పిందట. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేయనున్న వెబ్ సీరీస్ లో సాయి నటిస్తోంది. ఇందులో ఆమె తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తుండడం మరో విశేషం.

మామూలుగా కథ నచ్చనిదే సినిమాలే ఒప్పుకోని సాయిపల్లవి ఇప్పుడు వెబ్ సీరీస్ చేయడానికి కూడా ఒప్పుకుందంటే, ఇది కచ్చితంగా మంచి కాన్సెప్ట్ తో వస్తున్నదే అయివుంటుందని అంటున్నారు. ఆనర్ కిల్లింగ్స్ (పరువు హత్యలు) నేపథ్యంలో ఈ సీరీస్ రూపొందుతుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఈ సీరీస్ త్వరలోనే షూటింగును ప్రారంభించుకుంటుందట.    
Saipallavi
Rana
Naga Chaitanya
Prakash Raj

More Telugu News