రిటైర్ అయ్యేంత వరకు కూడా సచిన్ ఆ విషయం నేర్చుకోలేదు: కపిల్ దేవ్

29-07-2020 Wed 14:28
  • సచిన్ గొప్ప ప్రతిభావంతుడు
  • 100 సెంచరీలు చేసిన ఒకే ఒక్క ఆటగాడు
  • సచిన్ లాంటి ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు
Sachin is a greatest player i have ever seen says Kapil Dev

ఇండియాకు తొలి ప్రపంచ క్రికెట్ కప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ రిటైర్మెంట్ వరకు ఒక విషయాన్ని మాత్రం నేర్చుకోలేదని కపిల్ అన్నారు. సచిన్ లాంటి గొప్ప ప్రతిభావంతుడిని తాను చూడలేదని... అయితే వన్డేల్లో 100 పరుగులను 200లకు... టెస్టుల్లో 200 పరుగులను ట్రిపుల్ సెంచరీకి ఎలా మలచాలో సచిన్ తెలుసుకోలేదని చెప్పారు. ఈ విషయాన్ని సచిన్ నేర్చుకుని ఉంటే... మరిన్ని అద్భుతమైన రికార్డులు సచిన్ సొంతమై ఉండేవని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ఒకే ఒక్క ఆటగాడు సచిన్ అని కితాబిచ్చారు.