బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

29-07-2020 Wed 13:13
  • సుశాంత్ ప్రియురాలు రియాకు బిగుస్తున్న ఉచ్చు
  • రియాపై అనుమానాలను వ్యక్తం చేసిన సుశాంత్ తండ్రి
  • కోట్ల రూపాయల లావాదేవీలపై అనుమానాలు
Sushant Singh girl friend Rea Chakravarthy is in trouble

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రకంపనలకు గురవుతోంది. నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు సుశాంత్ మరణం తర్వాత పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిలో హీరోయిన్ రియా చక్రవర్తి ఒకరు. ఈమె గతంలో తెలుగు సినిమాలో కూడా నటించింది. సుశాంత్ ప్రియురాలిగా ఈమెకు గుర్తింపు ఉంది.

సుశాంత్ ఆత్మహత్య విషయంలో రియాపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ మరణానికి ముందు బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ తో ఆమె సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, రియాపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు కొన్ని విషయాలను చెప్పారు. దీంతో, రియాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రియాకు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది.

పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో సుశాంత్ తండ్రి ఏం చెప్పారంటే... గత ఏడాది కాలంలో.. రూ. 17 కోట్లలో ఒక అజ్ఞాత వ్యక్తికి  రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయని..  ఇందులో రియా పాత్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆయన కోరారు. దీంతో, రియాపై పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది.