తెలంగాణలో మరో 1,764 మందికి కరోనా నిర్ధారణ

29-07-2020 Wed 10:40
  • తెలంగాణలో మరో 1,764 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,906
  • ఇప్పటివరకు 43,751 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 492  
coronavirus cases in telangana

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకు 18,858  నమూనాలను పరీక్షించగా, వారిలో 1,764 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

జీహెచ్‌ఎంసీలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,906 అని పేర్కొంది. ఇప్పటివరకు 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 492 కి చేరింది.