హీరో సుశాంత్ సింగ్‌ ఆత్మహత్య కేసు: ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్

29-07-2020 Wed 09:26
  • డబ్బుకు సంబంధించిన విషయంపై ఆరోపణలు
  • సుశాంత్ తండ్రి నుంచి ఫిర్యాదు
  • పాట్నా నుంచి ముంబై వెళ్లిన పోలీసుల బృందం
fir against rhea

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఆయన ప్రేయసి రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆమెపై డబ్బుకు సంబంధించిన విషయంతో పాటు పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సుశాంత్ తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె కోసం బిహార్ రాజధాని పాట్నా నుంచి పోలీసుల బృందం ముంబైకి వెళ్లినట్లు సమాచారం. ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాట్నా సెంట్రల్ జోన్ ఐజీ సంజయ్ సింగ్ కూడా తెలిపారు.

కాగా, సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేయించాలని రియా ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కోరింది. కాగా, సుశాంత్ సింగ్ ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లో గత నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు సినీ పరిశ్రమలోని బంధుప్రీతే కారణమంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.