Nagarjuna: ఐదు నెలల తరువాత మేకప్ వేసుకున్న నాగార్జున!

Nagarjuna Starts Shooting First Time since Corona
  • మార్చి నుంచి ఇంటికే పరిమితం
  • బిగ్ బాస్ ప్రోమో షూటింగ్ కు హాజరు
  • అన్ని జాగ్రత్తలతో షూటింగ్ పూర్తి
కరోనా కారణంగా మార్చి నుంచి షూటింగ్స్ నిలిచిపోగా, అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన టాలీవుడ్ హీరో నాగార్జున, తొలిసారిగా బయటకు వచ్చారు. ఆగస్టు రెండో వారం నుంచి బిగ్ బాస్ సీజన్ - 4 ప్రారంభం కానుండగా, ప్రోమో షూటింగ్ కోసం ఆయన మేకప్ వేసుకున్నారు. ప్రోమో షూటింగ్ జరిపే విషయంలో నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నారట. ఇక నాగార్జున సైతం కరోనా సోకకుండా తనవంతు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. సినిమా షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు లభించిన తరువాత, తొలిసారిగా మేకప్ వేసుకున్న పెద్ద హీరో నాగార్జునే కావడం గమనార్హం. ఇక, హౌస్ లోకి ప్రవేశించే కంటెస్టెంట్ లు షో ప్రారంభానికి రెండు వారాల ముందు నుంచే క్వారంటైన్ లో ఉండాలని నిర్వాహకులు ఆదేశించనున్నారని సమాచారం. హౌస్ లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Nagarjuna
Bigg Boss
Promo
Shooting

More Telugu News