NIA: భీమా కోరేగావ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

NIA arrests assistant professor Hany Babu in Bhima Koregaon case
  • ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హనీబాబు అరెస్ట్
  • నాలుగు రోజుల కిందటే హనీబాబును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
  • ఇదే కేసులో ఇప్పటికే వరవరరావు అరెస్ట్
మావోయిస్టులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారంటూ ఇప్పటికే విరసం నేత వరవరరావును అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది. భీమా కోరేగావ్ కేసుగా ప్రచారంలో ఉన్న ఈ కేసులో ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హనీబాబు (54)ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హనీబాబు మావోయిస్టు అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్టు గుర్తించారు. హనీబాబు స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని నోయిడా. కాగా, హనీబాబును నాలుగురోజుల కిందటే అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
NIA
Hany Babu
Bhima Koregaon
Delhi
Varavara Rao

More Telugu News