Trisha: త్రిష వీడియోలు బయటపెడతా: తమిళ నటి మీరా మిథున్

I will reveal complete video of Trisha says Meera Muthun
  • త్రిష చిన్న రోల్స్, సైడ్ రోల్స్ చేసింది
  • కోలీవుడ్ మాఫియాతో చేతులు కలిపింది
  • నా ఆఫర్లను పోగొట్టింది
తమిళ సినీ పరిశ్రమలో అందాల భామ త్రిష, మరో సినీ నటి మీరా మిథున్ ల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో మీరా పాల్గొంది. అవకాశం దొరికినప్పుడల్లా త్రిషపై మీరా విరుచుకుపడుతుంటుంది. తాజాగా త్రిషను ఉద్దేశించి మీరా సంచలన వ్యాఖ్యలు చేసింది.

'ఐదున్నర అడుగుల ఎత్తున్న మిస్ చెన్నై త్రిష... చిన్నచిన్న రోల్స్, సైడ్ రోల్స్ చేసి మెయిన్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత కింగ్ ఫిషర్ మోడల్ అయింది. అభద్రతా భావంతో ఆమె కోలీవుడ్ మాఫియాతో చేతులు కలిపింది. 'ఎన్నై అరిందల్' చిత్రం నుంచి నన్ను తప్పించింది. ఈ సినిమా నుంచి నన్ను తొలగించడంతోనే త్రిష పనులు ఆగిపోలేదు. 'పెట్ట' సినిమా నుంచి కూడా నన్ను తప్పించింది. త్రిషకు సంబంధించిన వీడియోను బయటపెడతా' అని తెలిపింది.
Trisha
Meera Mithun
Kollywood

More Telugu News